వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దాంతో రోజుకు రెండుసార్లయినా స్నానం చేయాల్సి వస్తుంది. కొందరికి ఎండల్లో ప్రతిరోజూ తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. అయితే, ఇలా రోజూ తలస్నానం చేయడం.. జుట్టుకు చేటు చేస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.