జార్జెట్ చీరల్ని మహిళలు భలేగా ఇష్టపడతారు. తేలికగా ఉండటం, సౌకర్యవంతంగా అనిపించడం ప్రధాన కారణం. చీరకట్టులో ఎంతసేపున్నా విసుగు అనిపించదు. అందులోనూ కొత్తకొత్త డిజైన్లు వస్తున్నాయి.
ఈ బ్లాక్ అండ్ వైట్ మెరుపుల్ని ఒకసారి గమనించండి. శాటిన్ వస్త్రంతో రూపొందించిన క్రాప్టాప్ జాకెట్లో మగువ అందం రెట్టించింది. ట్రైబల్ జువెలరీని తలపించే హారం, లోలాకులు, ఉంగరం, గాజులు.. చక్కగా మ్యాచ్ అయ్యాయి.