1 భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి చైర్మన్‌గా నియమితులైన
తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు?
2 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి ఆహ్వానం అందుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఎవరు?
3 రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ ఆగస్టు 9న యూట్యూబ్ మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మరణించారు. ఆమె ఎవరు?
4 ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి మంచి ర్యాంకు సాధించిన సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన కార్పొరేట్ సంస్థ ఏది?
5 భరతనాట్యంలో పూర్తిగా చైనాలోనే శిక్షణ పొందిన ఓ పదమూడేండ్ల విద్యార్థిని ఇటీవల తన తొలి ప్రదర్శన ఇచ్చింది. చైనాలో శిక్షణ పొంది, అక్కడే అరంగేట్రం చేసిన రికార్డు సాధించిన ఆ విద్యార్థిని పేరేంటి?
6 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. అయితే, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్‌గా వార్తల్లో నిలిచిన క్రీడాకారుడు ఎవరు?
7 పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అగ్రనాయకుడు బుద్ధదేబ్ భట్టాచార్జీ ఆగస్ట్ 8న మరణించారు. ఆయన రాసిన పుస్తకాలేవి?
8 ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధికంగా 26 సార్లు రీమేక్ అయిన చిత్రంగా ఓ ఇటాలియన్ మూవీ ఇటీవల వార్తల్లో నిలిచింది. ‘ఖేల్ ఖేల్ మే’ పేరుతో హిందీలో విడుదలైన ఈ సినిమా అసలు పేరేంటి?
9 సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా, సర్వోన్నత న్యాయస్థానంలోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఓ బాలీవుడ్ చిత్రం ఆగస్టు 9న ప్రదర్శనకు నోచుకుంది. ఆ సినిమా ఏది?
10 అమెరికా అధికార చిహ్నంగా ఓ పక్షి 240 ఏండ్లుగా వాడుకలో ఉంది. అయితే, దానికి ఇటీవల జాతీయ పక్షి హోదా కల్పిస్తూ ఆ దేశ సెనెట్ నిర్ణయం తీసుకుంది. అది ఏ పక్షి?
1. చల్లా శ్రీనివాసులు శెట్టి
2. ఆకర్షణ సతీశ్ (తాను సేకరించిన దాదాపు పదివేల పుస్తకాలతో తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో 15 గ్రంథాలయాలు నెలకొల్పింది.)
3. సుసాన్ వోజ్కికి (56 ఏండ్లు)
4. రిటెయిల్ దిగ్గజం వాల్‌మార్ట్
5. లీ ముజి
6. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
7. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నాజీ జర్మనీ, కయోస్ అండర్ హెవెన్
8. పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్
9. లాపతా లేడీస్
10. అమెరికన్ బాల్డ్ ఈగల్