ఉక్కు వనిత!
అవని నుంచి గగనం వరకు అతివ అన్ని రంగాల్లో రాజ్యమేలుతున్నది. ఇప్పుడు భూగర్భంలోనూ తనకు చోటుందని నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన గాయత్రి.
అవని నుంచి గగనం వరకు అతివ అన్ని రంగాల్లో రాజ్యమేలుతున్నది. ఇప్పుడు భూగర్భంలోనూ తనకు చోటుందని నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన గాయత్రి. 114 ఏండ్ల టాటా స్టీల్ చరిత్రలో మొట్టమొదటి మైనింగ్ ఇంజినీర్‌గా వార్తల్లోకి ఎక్కింది. సాధారణంగా ఇంజినీరింగ్ పట్టభద్రులు భద్రంగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఎంచుకుంటారు. కానీ, గాయత్రి మాత్రం కొత్త పంథాను ఎంచుకోవాలని భావించింది.
ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు టాటా స్టీల్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడే ఆమెకు మైనింగ్ ఎంత కష్టమో తెలిసొచ్చింది. నల్లేరు మీద నడక కాదు.. పల్లేరు కాయల కన్నా కఠినంగా ఉండే భూగృహంలో సత్తా చాటాలని ఫిక్సయింది. అందుకే, మైనింగ్‌లోకి రంగప్రవేశం చేసింది. ఇంజినీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్స్‌లో అవకాశం వచ్చింది. ‘నేను సాధించిన దానికి గర్వపడుతున్నాను. మొదట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇప్పుడు మరికొంత మంది మహిళా ఇంజనీర్లు జాయిన్ అవుతున్నారు. వాళ్లందరికీ ఆదర్శంగా ఉండటం సంతోషంగా ఉంద’ని చెప్పుకొచ్చింది గాయత్రి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

