చాలా ఇళ్లలో టిఫిన్ అంటే.. ఇడ్లీలు, దోశలే! వీటిని సిద్ధం చేయాలంటే మాత్రం.. ఎంతోకొంత ప్రయాస పడాల్సిందే! కావాల్సినవన్నీ ముందురోజే నానబెట్టుకోవడం.. పిండి రుబ్బుకోవడం.. పెద్ద తతంగమే! దాంతో చాలామంది వారానికి సరిపడా పిండిని ఒకేసారి రుబ్బుకుంటారు. ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. అయితే.. రుబ్బిన పిండిని ఇలా ఫ్రిజ్లో రోజుల తరబడి పెట్టుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.