వయసొచ్చిందని పెళ్లి చేశారు. తర్వాత పిల్లలు, వాళ్ల చదువులు. కళ్లుమూసి తెరిచేలోపే సగం జీవితం అయిపోతుంది!! ఇలా 40 ఏళ్లు వచ్చేసరికి చాలామంది మిడ్‌లైఫ్ క్రైసిస్‌ని లోలోపల ఫీల్ అవుతుంటారు. ఈ పరిస్థితిని బయటికి చెప్పుకోలేక పోతుంటారు. గతంలో నలభైలోకి వచ్చినప్పటి నుంచే పెద్దవారు అయిపోయినట్టుగా ఫిక్సయ్యేవారు. కట్టు, బొట్టు వ్యవహారాలు కూడా మార్చేసేవారు. ముఖ్యంగా మహిళలు అయితే.. భారంగా జీవితం గడిపేవారు. ఇప్పుడిప్పుడే నలభైలోకి ప్రవేశిస్తున్న మిలీనియల్స్ మాత్రం ఈ క్రైసిస్ మాకొద్దు అంటున్నారు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. పక్కా ప్లాన్ ప్రకారం నడి వయసును హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోకుంటూ దూసుకెళ్తున్నారు.