ఆధునిక యువతులు అందానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ‘బ్యూటిఫుల్!’ అనిపించుకోవడానికి బోలెడు తాపత్రయ పడుతున్నారు. తమ ముఖవర్ఛస్సుకు మెరుగులు దిద్దడానికి.. రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. అయితే, ఈ బ్యూటీ ప్రోడక్ట్స్‌లో సింహభాగం.. హానికర రసాయనాలతో సింగారించుకొనే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవన్నీ అందాన్ని మెరుగుపరుస్తూ.. హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ‘బ్యూటీ’ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
సౌందర్య ఉత్పత్తుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని బ్యుటీషియన్లు చెబుతున్నారు. బడ్జెట్లో వస్తున్నాయని నాణ్యతలేనివి కొనకూడదని అంటున్నారు. అన్ని వస్తువులను కొనే బదులు.. మీ బడ్జెట్లోనే అవసరమైన వాటిని కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. ఇక డీప్ కండిషనర్, ప్రొటీన్ షాంపూలు, మెడికేటెడ్ లిప్‌బామ్, డ్రై షాంపూలు, ప్రైమర్, మస్కారా లాంటివి చాలామందికి పడవు. అలాంటప్పుడు వాటిని పక్కన పెట్టేయడమే మంచిది.
డీప్ కండిషనర్, ప్రొటీన్/ డ్రై షాంపూలను ఎక్కువగా వాడితే.. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. కురులు బలం కోల్పోయి.. ఎక్కువగా రాలిపోతాయి. ప్రైమర్ అధికంగా వాడితే.. చర్మంపై స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. తద్వారా చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ప్రైమర్‌ను తక్కువగా వాడుకోవాలి. మస్కారా వల్ల కనుబొమల్లోని తేమ తగ్గిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబడటం, పొడిబారడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, రాత్రిపూట నిద్రించేటప్పుడు.. వీటిని పూర్తిగా తొలగించుకోవాలి.