ఫిట్నెస్ అంటే.. కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటం. జిమ్‌లో బరువులు ఎత్తితే కండరాలు బలపడతాయి. శరీర అవయవాలు దృఢంగా తయారవుతాయి. అదే ‘మానసిక కండరాలు’ బలోపేతం చేస్తే.. జ్ఞాపకశక్తి, శ్రద్ధ, మెదడు వేగం, మానవ నైపుణ్యాలు, తెలివితేటలు మెరుగుపడతాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్, రన్నింగ్, యోగాను ఆశ్రయిస్తాం. మరి.. మనస్సుకు ఎలాంటి వ్యాయామం చేయాలో నిపుణులు ఇలా చెబుతున్నారు.