కొంతమంది రాత్రి భోజనం తర్వాత తప్పని సరిగా తీపి పదార్థాలు తింటుంటారు. మరి కొందరు ఆరోగ్యానికి హాని చేసే ఐస్ క్రీమ్, స్వీట్లు పక్కన పెట్టి పోషకాలతో నిండిన పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ, వాటిని సరైన సమయంలో తినాలి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
జీర్ణక్రియలో జాప్యం: సాధారణంగా పండ్లు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులోకి వెళ్లిన 20 నుంచి 40 నిమిషాల్లోనే జీర్ణం కావాల్సి ఉంటుంది. కానీ, భారీ భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే సమస్యలు మొదలవుతాయి. అప్పటికే మన శరీరం భోజనంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో ఉండటం వల్ల, పండ్లు జీర్ణాశయంలో ఎకువ సేపు ఉండిపోవాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల పండ్లలోని చకెరలు, ఫైబర్ కడుపులో పులిసిపోయే అవకాశం ఉంటుంది.
కనిపించే లక్షణాలు: భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల.. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, అధికంగా తేన్పులు రావడం, పొట్ట బిగుతుగా అనిపించడం, కడుపులో తిమ్మిర్లు లేదా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణవ్యవస్థ రాత్రిపూట అధిక పనిభారానికి గురికావడం వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే అన్ని రకాల పండ్లు ఇబ్బంది కలిగించవు. కానీ కొన్ని పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆపిల్స్, మామిడి పండ్లు, పుచ్చకాయల్లో ఫ్రక్టోజ్ అనే సహజ చకెర అధికంగా ఉంటుంది. శరీరం ఈ ఫ్రక్టోజ్‌ను సరిగ్గా గ్రహించలేకపోతే అది పేగుల్లో ఎకువ సేపు ఉండిపోయి పులిసిపోయేలా చేస్తుంది.
ఫలితంగా తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం కలుగుతాయి. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పండ్లకు దూరంగా ఉండటం మంచిది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే భోజనంతో కలిపి కాకుండా, విడిగా పండ్లను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ముందు లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్‌గా పండ్లు తీసుకోవడం మంచిది. ప్రతి ఒకరి జీర్ణశక్తి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, మీ శరీర ధర్మాన్ని బట్టి పండ్లు తినే సమయాన్ని నిర్ణయించుకోవాలి.