Teddy Bear Museum | ప్రత్యేకంగా టెడ్డీబేర్స్ కోసమే ఓ మ్యూజియం ఉంది.. ఎక్కడో తెలుసా !!
Teddy Bear Museum | పిల్లల అరల్లో కచ్చితంగా కనిపించే బొమ్మ టెడ్డీబేర్. పిల్లలున్న ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఓ టెడ్డీబేర్ దర్శనమిస్తుంది. పిల్లలకు టెడ్డీలంటే ప్రాణం. ముద్దుచేస్తారు, ఎత్తుకుంటారు, మాట్లాడతారు, దెబ్బలాడతారు. టెడ్డీబేర్‌కు థాయ్‌లాండ్‌లోని పటాయాలో ఓ పెద్ద మ్యూజియమే ఉంది. ఇక్కడ కళ్లు చెదిరే టెడ్డీలున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా..
‘ట్రావెల్ ట్రెజర్ హంటింగ్ విత్ టెడ్డీబేర్’ అనే కాన్సెప్ట్‌తో ఈ టెడ్డీ మ్యూజియాన్ని నిర్మించారు. ఇందులో నలభై మీటర్ల పొడవుండే డ్రాగన్ బోట్ ఉంటుంది. ఆగ్నేయాసియాలో 2,500 చ.మీ విస్తీర్ణంలో నిర్మించిన మొట్టమొదటి టెడ్డీ ప్రదర్శనశాల ఇదే. ఈ మ్యూజియంలో అనేక రంగుల్లో, పరిమాణాల్లో, చిత్రవిచిత్రమైన పోజుల్లో టెడ్డీబేర్లను చూడవచ్చు. ఇన్కా, డైనోసార్, ఫాజిల్, ఆఫ్రికా, థాయ్‌లాండ్, అండర్ సీ, ఎస్కిమో, శాంటా, స్పేస్, ఫెయిరీ టెయిల్, చైనా, యూరోప్.. ఇలా పన్నెండు భిన్నమైన జోన్లు ఉంటాయి.

ప్రతి జోన్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కండ్లకు కట్టినట్టు చూపించేలా వీటిని రూపొందించారు. కొన్నిటిని ముట్టుకుంటే, వింత శబ్దాలతోపాటు రంగురంగుల కాంతినీ వెదజల్లుతాయి. మరికొన్నయితే, నిజమైన బేర్లేమో అనేంతగా భ్రమింపజేస్తాయి. శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ప్రదర్శనలో ఫెయిరీ టెయిల్ జోన్‌లోని టెడ్డీబేర్లను ప్రదర్శిస్తారు. ఆ బొమ్మల నడుమ కాసేపు కూర్చునే అవకాశమూ ఉంది. ఆవరణలోని గిఫ్ట్షాప్లో నచ్చిన టెడ్డీలను కొని తెచ్చుకోవచ్చు. భలే ఉంది కదూ!
Read More :
Trending news: ఐటీ జాబ్ వదిలేసి గాడిద పాలు అమ్ముతున్నాడు.. సంపాదన చూస్తే దిమ్మతిరగాల్సిందే!!
82 రోజులు..2500 కిలోమీటర్లు : కాలినడకన హౌరా నుంచి లడఖ్‌కు చేరిన ఛాయ్‌వాలా
Viral Video | సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన గొరిల్లా.. కిందపడిన కోపంలో ఏం చేసిందో చూడండి!
ull Arrest | వింత అరెస్టు.. పిల్లాడిపై దాడి చేసినందుకు ఎద్దును అరెస్టు చేసిన పోలీసులు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

