వేసవిలో విరివిగా దొరికే కీరదోస.. మండే ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇటు ఆరోగ్యానికి భరోసా ఇవ్వడంతోపాటు.. అటు అందానికీ అండగా నిలుస్తుంది. ఇందులోని సహజసిద్ధమైన సుగుణాలు.. మేనికి కొత్త మెరుపును తీసుకొస్తాయి. కీరదోసను తీసుకోవడం, వీటితో తయారైన ఉత్పత్తులను వాడటం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.