సీతాకోకచిలుక ఓ అద్భుతం. కదలలేని పురుగు నుంచీ ఎగిరే చిలుకగా మారేదాకా సాగే దాని జీవిత కథ ఓ అపురూపం. పరివర్తన అన్నది ఎంత అందంగా ఉంటుందో చూపించాలంటే సీతాకోకచిలుక జీవిత చక్రం చూపిస్తే చాలు. మరి అంత ప్రత్యేకమైన విషయాన్ని ఎందుకు విస్మరించాలి అనుకున్నారో ఏమో… ‘బటర్ ఫ్లై లైఫ్ సైకిల్ జువెలరీ’ తయారు చేస్తున్నారు వినూత్నతకు పెద్దపీట వేసే ఫ్యాషన్ డిజైనర్లు.
గొంగళి పురుగు, ప్యూపా, లార్వా దశలు, సీతాకోకచిలుక రూపం… ఇలా దాని కథంతా కళ్లకు కట్టినట్టు కనిపించేలా ట్రెండీ నగల్ని రూపొందిస్తున్నారు. గొలుసులు, లాకెట్లు, చెవి పోగుల్లో ఈ చక్రాన్ని అమర్చి విభిన్నమైన నగలకు రూపకల్పన చేస్తున్నారు. అందమంటే ఒక్క సీతాకోకచిలుకదే కాదు, దాని చరిత్రదీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.