HomeLifestyleBilla Ganneru Is Very Effective In Controlling Hair Problems
ఇంటి చిట్కాలు
జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలో బిళ్ల గన్నేరు బాగా పనికొస్తుంది. ఒక కప్పు బిళ్ల గన్నేరు ఆకులను మిక్సీ పట్టుకొని రసం తీసుకోవాలి.
జుట్టు సమస్యలకు చెక్ పెట్టడంలో బిళ్ల గన్నేరు బాగా పనికొస్తుంది. ఒక కప్పు బిళ్ల గన్నేరు ఆకులను మిక్సీ పట్టుకొని రసం తీసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకొని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఒక గంటపాటు అలాగే వదిలేసి.. తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గాయాలు, పుండ్లను తగ్గించడానికీ బిళ్ల గన్నేరును వాడవచ్చు. మొక్క ఆకులకు కాస్త పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని గాయాలకు రాస్తే.. త్వరగా మానుతాయి.