ఇంటి పెరట్లో పెంచే మొక్కల్లో ‘బిళ్ల గన్నేరు’ ముందుంటుంది. తెలుపు, గులాబీ వర్ణాల్లో చూడముచ్చటైన పూలు పూస్తుంది. అయితే.. ఈ మొక్క ఇంటికి అందాన్ని ఇవ్వడంతోపాటు మనకు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది.
చాలా మంది తమ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో, ఇంటి లోపల అనేక పూల మొక్కలను పెంచుతుంటారు. పూల మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు, ఇంటికి చక్కని ఆకర్షణీయతను తీసుకువస్తాయి.