పాదాల పగుళ్లను తగ్గించడంలో పసుపు నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో రెండు చుక్కల పసుపు నూనె కలిపి.. ఆ మిశ్రమంతో పాదాలను మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఈ టిప్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయితే.. పగుళ్లు తగ్గడంతోపాటు పాదాలు కూడా మృదువుగా తయారవుతాయి.
కొబ్బరినూనెలో ఐదారు చుక్కల పసుపు నూనె కలిపితే.. జుట్టుకూ అనేక ప్రయోజనాలు అందుతాయి. పసుపు నూనెలో చుండ్రును నివారించడంతోపాటు జుట్టు రాలడాన్ని తగ్గించే గుణాలు అధికం. ఇందులోని యాంటి ఫంగల్ లక్షణాలు.. జుట్టు కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.