ఊబకాయాన్ని వదలించుకోవడానికి అందరూ ఉబలాటపడుతుంటారు. బరువు తగ్గేందుకు కడుపు కట్టేసుకుంటారు. నాజూకుగా తయారవ్వాలని.. లేనిపోని డైట్ పాటిస్తూ, వ్యాయామం అంటూ నానా అవస్థలూ పడుతుంటారు. కానీ, చాలామంది మధ్యలోనే చేతులెత్తేస్తారు. అయితే.. క్రమశిక్షణతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం పెద్ద విషయమేమీ కాదని అమెరికాకు చెందిన ‘అమకా’ అంటున్నది. కేవలం నాలుగు నెలల్లోనే 25 కిలోలు తగ్గిన ఈ ఫిట్నెస్ ట్రైనర్.. అందరితో ‘ఔరా!’ అనిపించుకున్నది. ఇందుకోసం తాను చేసిన త్యాగాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నది.