కొన్ని చిత్రాలు చూడగానే అర్థంకావు. లోతుగా పరిశీలిస్తేనే.. వాటిలో అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. చిత్రకళలోనే కాదు.. ఫొటోగ్రఫీలోనూ అలాంటి శైలి ఒకటి ఉంది. అదే.. అబ్స్ట్రాక్ట్ డిటెయిల్స్ ఫొటోగ్రఫీ! ఈ రకమైన ఫొటోగ్రఫీలో సబ్జెక్టు (వస్తువు) ఏమిటి? అనేదాని కంటే.. అది ఎలా కనిపిస్తున్నది? అనేదే ముఖ్యం. ఇందులో సబ్జెక్టుకు చెందిన లోతైన రూపాలు, నమూనాలను స్పష్టంగా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఫామేషన్, కలర్, టెక్చర్, షాడోస్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ‘ప్రొ మోడ్’ ఉంటే ఆన్ చేసుకుంటే మంచిది.
1. సాధారణ వస్తువుల్లోనూ అసాధారణ యాంగిల్స్ కనిపెట్టండి. కనిపించిన ప్రతి వస్తువునూ వివిధ యాంగిల్స్‌లో గమనిస్తుండండి.
2. డిటెయిల్స్ స్పష్టంగా రావాలంటే.. సబ్జెక్ట్‌కు మరింత దగ్గరగా వెళ్లండి. జూమ్, మ్యాక్రో మోడ్‌ను ఉపయోగించండి.
3. సబ్జెక్ట్‌పై కాంతి పడే దిశను మార్చి.. సరికొత్త రూపాన్ని క్యాప్చర్ చేయండి. ఇందుకోసం లైట్ అండ్ షాడోస్‌ను వాడుకోండి.
4. సబ్జెక్ట్ రంగులు, టెక్చర్పై దృష్టి పెట్టండి.
5. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసి మెయిన్ సబ్జెక్ట్‌పైనే ఫోకస్‌ను పెట్టండి. దాంతో దృష్టిమొత్తం ప్రధాన సబ్జెక్ట్‌పైనే నిలుస్తుంది.
చివరగా.. అబ్స్ట్రాక్ట్ డిటెయిల్స్ ఫొటోగ్రఫీ అనేది మీ కళాత్మక దృష్టిని అభివృద్ధి చేసే ప్రక్రియ. మొబైల్ కెమెరా సహాయంతోనూ సాధారణ దృశ్యాలను అసాధారణమైన ఫొటోలుగా మలచవచ్చు. ఈరోజే మీ చుట్టూ ఉన్న వస్తువులను కొత్తగా చూడండి. పాతగోడలపై ఉండే టెక్చర్.. నీళ్ల మడుగులో కనిపించే ప్రతిబింబం.. ఇలా ప్రతీదానిలో ఒక కళ దాగి ఉంది. ఆ బ్యూటీని కనిపెట్టి.. దాన్ని ఓ అద్భుతమైన కళగా మలచండి.
– ఆడెపు హరికృష్ణ