దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ప్రతి గంటకు ఒకసారి సీట్లోంచి లేచి ఐదు నిమిషాలు నడవడం లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. లంచ్‌బాక్స్‌లో ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా, ధ్యానం, వాకింగ్ కోసం కేటాయిస్తే ఒత్తిడి తగ్గి, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
మహిళల ఆరోగ్యం వ్యక్తిగత అంశం కాదు, అది సమాజ ప్రగతితో ముడిపడి ఉంది. ఒక ఆరోగ్యకరమైన మహిళే ఉత్పాదకత కలిగిన ఉద్యోగినిగా, బాధ్యతగల గృహిణిగా రాణించగలదు. అలాగే, పని ప్రదేశాల్లో మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యత కూడా!