1.47 లక్షల దిగువకు పుత్తడి. మరో రూ.9 వేలు తగ్గిన కిలో వెండి
బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో భారీగా ధరలు పడిపోతున్నాయి.
న్యూఢిల్లీ, జూలై 14 : బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో భారీగా ధరలు పడిపోతున్నాయి. ఇదే క్రమంలో నూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1.47 లక్షల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి గోల్డ్ ధర రూ.700 తగ్గి రూ.1,46,300గా నమోదైంది.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.8,900 తగ్గి రూ.2,26,100గా నమోదైనట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు వెండి రూ.2.35 లక్షలుగా ఉన్నది. ఆభరణాలు, ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ బలహీనంగా ఉండటంతో అతి విలువైన లోహాలు ఒత్తిడికి గురయ్యాయని ట్రేడర్లు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

