శనివారం 27 ఫిబ్రవరి 2021
Komarambheem - Jan 23, 2021 , 01:33:39

అవగాహన కలిగి ఉండాలి

అవగాహన కలిగి ఉండాలి

ఆసిఫాబాద్‌ ఆంబేద్కర్‌ చౌక్‌, జనవరి 22 : రోడ్డు నిబంధనలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ అచ్చేశ్వర్‌రా వ్‌ అన్నారు. రోడ్డు భద్రతా వా రోత్సవాల్లో భాగంగా జిల్లా కేం ద్రంలో శుక్రవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యా లీని జెండా ఊపి ప్రారంభించారు. వాహనాలు నడిపే సమయంలో నియమాలు పాటించాలని సూచించారు. హెల్మెట్‌ తప్పకుండా ధరించాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ ఉమామహేశ్వరరావు, డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి, అసిస్టెంట్‌ మేనేజర్‌ దేవపాల, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, ఆర్డీవో, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.

సిర్పూర్‌(టి), జనవరి 22 : వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సిర్పూర్‌(టి) ఎస్‌ఐ రవికుమార్‌ సూచించారు. స్థానిక బస్టాండ్‌ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు అవగాహన కల్పించారు.


VIDEOS

logo