గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 06, 2020 , 00:22:25

కొవిడ్‌-19పై అలర్ట్‌

కొవిడ్‌-19పై అలర్ట్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19(కరోన) వైరస్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.. కరోనా కేసులు హైదరాబాద్‌లో కూడా నమోదవుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం అన్నిరకాల ముందస్తు చర్య లు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జిల్లాలో వైద్యాధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో ప్రత్యేకంగా ఆరు బెడ్లతో కరోనా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రత్యేక నియమించారు. జిల్లాలో ఈ వైరస్‌ ప్రభావం ఇప్పటికైతే ఏమిలేకపోయినప్పటికీ అధికారులు మాత్రం పూర్తి అప్రమత్తతతో వ్యవ హరిస్తున్నారు.


పీహెచ్‌సీల్లో ప్రత్యేక కమిటీలు

కొవిడ్‌-19 వైరస్‌ సోకకుండా వైద్యాధికారులు ముందస్తు చర్య లు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు అవగాహ కల్పించడంతోపాటు, ఎక్కడైన అనుమానిత కేసులు గుర్తిస్తే వెంటనే జి ల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, రెండు అర్బన్‌ సెంటర్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశా రు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆ పీహెచ్‌సీ వైద్యుడితోపాటు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎంలతో కూడిన బృందాలను నియమించారు. జిల్లాలో  20 బృందాలతోపాటు రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో రెండు కమిటీలను వేశారు. నిత్యం పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు అవగాహన కల్పించడంతోపా టు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి ఈ వైరస్‌ వ్యాప్తిపై వివరించను న్నారు. ఈ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తె లుపనున్నారు.


 జిల్లా దవాఖానలో ప్రత్యేక వార్డు

జిల్లాలో ఈ వ్యాధి సోకినట్లు ఎక్కడైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే జిల్లా కేంద్ర దవాఖానలో చేర్పించి ప్రాథమిక వైద్యాన్ని అం దించేందుకు ప్రత్యేకంగా 6 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.  అనుమానిత రోగికి ప్రాథమికంగా అందించాల్సిన మందులను కూ డా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు తెలిపారు. ఈ వార్డును ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు డాక్టర్‌ ప్రేమ్‌  సాగర్‌ అనే వైద్యున్ని నోడల్‌ అధికారిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.  


త్వరలో కాల్‌సెంటర్‌ ఏర్పాటు

కొవిడ్‌-19 వైరస్‌పై జిల్లా ప్రజలకు  సకాలంలో సేవలందించేందుకు త్వరలోనే  కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో కాల్‌సెంటర్‌ అందుబాటులోనికి రానుంది. జిల్లాలో ఎక్కడైనా,  ఎవరికైన ఈ వ్యాధి సోకినట్లు అనుమానం కలిగితే వెంటనే కాల్‌సెంటర్‌కు పోన్‌చేసి సమాచా రం అందించాలని సూచిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సమాచారం తో ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వెళ్లి కావాల్సిన  జాగ్రత్తలు తీసుకునే వీలుకలుగనుంది.


అవగాహన  ఎంతో అవసరం..

ప్రస్తుతం జిల్లాలో ఈ వైరస్‌ ప్రభావమేమీ లేకపోయినప్పటికీ ఈ , ప్రజలకు అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని  వైద్యాధికారులు చెబుతున్నారు. కొవిడ్‌-19పై  అనవసరంగా భయాందోళన  చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కొవిడ్‌-19ని ఎదుర్కోవా లంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతున్నా రు. కొవిడ్‌-19 కణాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే 400 నుంచి 500 మైక్రో సైజును కలిగి ఉంటాయి. కాబట్టి ముఖానికి మా స్క్‌ వాడితే ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించదు. ఈ వైరస్‌ ఉపరిత లంపై సుమారు 10 నుంచి 12గంటల కంటే ఎక్కువగా బతికి ఉండ లేదు. ఇది పాత వైరస్‌,  గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదు. వైరస్‌ సోకిన వారు తుమ్మినా, దగ్గినా అతన్ని ముట్టుకోవడం, ఆ ప్రాంతంలోని వస్తువులను తాకిన వారు తిరిగి వారి కండ్లు, నోరు, ముక్కు వద్ద చేతులు పెట్టుకోవడం ద్వారా ఇది వ్యాపించే అవకాశం ఎక్కువ. అందుకే ఏ వస్తు వును తాకినా చేతులను సబ్బుతో శు భ్రం గా కడుక్కోవాలి. ఇది బట్టలపై ఉంటే తొమ్మిది గంటల వరకు ప్రాణా లతో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉతుక్కొని ఎండలో రెండు గంటల పాటు ఆరబెట్టాలి. 


ఒకవేళ ఈ వైరస్‌ చేతులపై గనుక వ్యాపిస్తే పది నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే స్పిరిట్‌ ఆధారిత శానిటైజ ర్‌ వెంట ఉంచుకోవడం మంచిది. ఈ వైరస్‌ కేవలం 27 డిగ్రీల సెల్సి యస్‌ లోపు ఉష్ణోగ్రతలో ఉంటేనే బతుకుతుంది. అంటే వేడి ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో జీవించలేదు. గోరువెచ్చని నీళ్లు తాగడం, కాసేపు ఎండలో నిలబడడం లాంటివి చేస్తే దీనిని ని యంత్రించే అవకాశం ఉంది. కాచి చల్లార్చిన నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కి లించడం ద్వారా టాన్సిల్స్‌ క్రిములను నిర్మూలిం చవచ్చు. దీంతో ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్‌ చేరకుండా నివా రించడం సులభం. అలాగే కొద్దిరోజుల పాటు ఐస్‌క్రీం వంటి చల్లని పదార్థాలకు దూ రంగా ఉండాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. అత్య వసరం అయితే ముఖానికి మాస్క్‌ ధరించి వెళ్లాలి. వీలైనంత వరకు హోలీ పండుగకు రసాయనిక రంగులు చల్లుకోవ డం దూరంగా ఉండడం మేలు. దగ్గు, జలుబు ఉన్న వారు మా స్క్‌ లు తప్పకుండా ధరించాలి. రక్తహీనతతో బాధపడుతున్న వారు, దీ ర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి తొందరగా వైరస్‌ వచ్చే అవకాశా లున్నాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మన మే కా కుండా మన ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధిం చవచ్చు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఒకవేళ  వైరస్‌ బారిన పడినట్లు అనుమానాలుంటే వారు వచ్చిన నాటి నుంచి రెండు వారాల(14 రోజుల) పాటు ఇతరులతో కలవకూడదు. ప్రత్యేక గదిలోనే నిద్రించా లి. దగ్గిన ప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టు కోవాలి.  సబ్బుతో చేతులను తరుచూ కడుక్కోవాలి


విద్యార్థులకు మాస్కుల పంపిణీ

ఆసిఫాబాద్‌ టౌన్‌: రాష్ట్రంలో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందిందని వస్తున్న వదంతుల నేపథ్యంలో గురు వారం మండలంలోని సాలేగూడ ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులకు గ్రామ యువకులు  మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మా ట్లాడుతూ  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలం టే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలనీ, చల్లని నీరు, ఐస్‌క్రీం తి నవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపా ధ్యాయులు,యువకులు పాల్గొన్నారు.logo
>>>>>>