శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Mar 01, 2020 , 23:32:06

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

కాగజ్‌నగర్‌టౌన్‌:  టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు అన్నారు. మండలంలోని పలు గ్రా మాల్లో అభివృద్ధి పనులకు ఆదివారం ఆ యన భూమి పూజ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారనీ, పల్లెల్లో ప్రగతి కోసం ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి మౌలిక వసతుల కల్పనకు కృ షి చేస్తున్నారని పేర్కొన్నారు. రాస్పల్లి గ్రామంలో రూ. 6.50లక్షల వ్యయంతో సీ సీ రోడ్డు, రూ. 12.90లక్షలతో శ్మశానవాటిక , గజ్జిగూడ, నాగంపేట గ్రామాల మధ్య రూ. 3కోట్లతో వాగుపై వంతెన నిర్మాణం చే పట్టేందుకు భూమిపూజ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ చీపిరిశెట్టి శంకర్‌, వైస్‌ ఎంపీపీ స్వదేశ్‌ శర్మ, సర్పంచ్‌ పద్మ కిషన్‌, నాయకులు వాసుదేవ్‌, కొం డయ్య, నరేష్‌, సంతోష్‌, తిరుపతి, గుం డయ్య, సమ్మయ్య, ఉమేష్‌, తదితరులు పాల్గొన్నారు. 
logo