శనివారం 28 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 00:55:58

ఇక పల్లె ప్రగతి నిరంతరం సాగాలి

ఇక పల్లె ప్రగతి నిరంతరం సాగాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఆదర్శవంతమైన పా లన ప్రజలకు అందివ్వాలని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. జిల్లాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా, అదనపు కలెక్టర్‌ రాంబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఇక నిరంతర పల్లె ప్రగతి

పల్లెల రూపురేఖలు మార్చిన ‘పల్లె ప్రగతి ’ కార్యక్ర మం ఇక నిరంతరం కొనసాగించాలని సూచించా రు. ఇప్పటి వరకు రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలు కో రుకున్న మార్పు కనిపించడంతో పాటు పారిశు ధ్యం, రవాణ, విద్యుత్‌ సమస్యలు పూర్తిగా పరిష్కా రం కావడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభు త్వం చేపడుతున్న కార్యక్రమాలు వ్యక్తులను బట్టి కా కుండా సమస్యల ప్రాధాన్యతకు అనుగుణంగా అ మలు కానున్నాయి. జిల్లాల కలెక్టర్లే ఈ ప్రాధాన్యత ను గుర్తించాల్సి ఉంటుంది. పల్లెల్లో పచ్చదనం. పా రిశుధ్యం కనిపించేలా కార్యక్రమాలను అ మలు చే యాల్సి ఉంటుంది. నాటిన ప్రతిమొక్కనూ కాపాడే బాధ్యతనూ తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్‌తో పా టు మిగితా అధికారులు ఒక జట్టులా పనిచేసి, సం క్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుం ది. ‘ఇప్పటికే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు,  గ్రామ పంచాయితీలను ఏర్పాటు చే సి ప్రజలకు పా లనను మరింత చేరువ చేశాం. ఆ యా పో స్టులను భర్తీ చేశాం. నిధులనూ విడుదల చేస్తున్నాం. అనుకున్న విధంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చ ర్యలు చేపట్టాలని’ సీఎం కలెక్టర్లను ఆదేశింంచారు.

పలు సమస్యలకు పరిష్కారం

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి పథకాల తో ఇప్పటికే తాగునీరు, సాగు నీటి సమస్యలనూ ఎ క్కడికక్కడా పరిష్కరించాం. ఆయా చోట్ల ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత క రెంట్‌ అందించేలా అధికారులు పర్యవేక్షించాలి. ప ల్లెల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభించాలి. గిరిజన తండాలు, ఆదివాసీ గుడాలు, దళిత వాడల్లో ప్రజా ప్రతినిధులతో కలసి అధికారులు పర్యటించాలి. దృష్టికి వచ్చిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులను చేపట్టేలా మిగితా యంత్రాంగాన్ని ఆదేశించా లి. ఆయా గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెంచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

15 రోజుల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనం

రానున్న 15 రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలి, సర్పంచులు, గ్రా మ కార్యదర్శులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించి, గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించాలి. దీనిద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పూర్తి అవకాశం క లుగుతుంది. 25 రోజుల్లో మొత్తం కార్యక్రమం పూ ర్తయ్యేలా వారికి అవగాహన కల్పించాలి. దీని ద్వా రా చేపట్టే పనులను ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు పరిశీలిస్తాయి. సీఎంగా తాను కూడా ఆకస్మిక పర్యటనకు వస్తానని చెప్పడం ద్వారా సంక్షేమ పనులను ఖచ్చితంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 


logo