సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 27, 2020 , 23:40:52

ట్రస్మా ఆధ్వర్యంలో నేడు, రేపు జిల్లా స్థాయి క్రీడాపోటీలు

ట్రస్మా ఆధ్వర్యంలో నేడు, రేపు  జిల్లా స్థాయి క్రీడాపోటీలు

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ప్రగతి  స్టేడియంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కస్తూరి పద్మచరణ్‌, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి స్టేడియంలో క్రీడా పోటీల ఏర్పాట్లను సోమవారం వారు పరిశీలించారు. రెండు రోజుల పాటు జిల్లా స్థాయి పాఠశాల విద్యార్థులకు అథ్లెటిక్స్‌, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌ బాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 1700 మందిక క్రీడారులు పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ పోటీలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, జీఎం లక్ష్మీనారాయణలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి దుర్గాప్రసాద్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు గోపతి సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి ప్రవీణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విక్రంరావు పాల్గొన్నారు. logo