భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని పలువురు శాస్త్రవేత్తలు అన్నారు. గురువారం కొత్తగూడెం రేడియో కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీకే కో ఆర్డినేటర్లు డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, డాక్టర్ కే.రవికుమార్, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కే.శిరీషలు మాట్లాడారు. మందుల పిచికారీ, కలుపుతీత, పంటల కోత, నూర్పిడి తదితర పనులకు అధునాతన వ్యవసాయ పరికరాలను వినియోగించాలన్నారు.
నేల, భూసారాన్నిబట్టి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఎంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఆదర్శ, ఉత్తమ రైతులను ఆకాశవాణి అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తమ అవార్డు గ్రహీత సత్యనారాయణ, ఆదర్శ రైతు అవార్డు గ్రహీత గొట్టిపాటి వెంకటేశ్వరరావు, నూరి రాజశేఖర్, ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకర్రావు, బొల్లవరపు ప్రసాద్, శనగస్వామి, సాంకేతిక సిబ్బంది రెడ్డి, బాబుసింగ్, ప్రభాకర్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ దివస్ సందర్భంగా పలువురు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులను ఘనంగా సన్మానించారు.