ఇల్లెందు/ టేకులపల్లి, నవంబర్ 1: ఇల్లెందులో బుధవారం జరిగిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75 వేల పైచిలుకు ప్రజలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇంత పెద్ద సభ జరగలేదని బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జీ వినీత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి చోట పోలీసులను మోహరించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని వాహనాలను పార్కింగ్ స్థలాలకు తరలించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఎం సభ ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇల్లెందులో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు మండలం నుంచి వేలాది బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు కేసీఆర్ రాక సందర్భంగా జెండాలు ధరించి వారి అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా మండల కమిటీ ఆధ్వర్యంలో సభకు వచ్చిన వారికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
01
ఇల్లెందు నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ గెలుపు కోసం బుధవారం ఇల్లెందులో బుధవారం ఏర్పాటు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
టేకులపల్లి, నవంబర్ 1: రాష్ట్ర సుపరిపాలన, సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజా శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలచారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులను తెలుసుకొని కులమతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలను ప్రజలకు చేరవేసి ప్రజల మన్ననలను పొందడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది.
టేకులపల్లి, నవంబర్ 1: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేపథకాలు, ప్రతి గ్రామంలో సీసీ, బీటీ రోడ్లు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశాపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బడుగు బలహీన వర్గాలు, కులవృత్తులకు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారు. ఇల్లెందు నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియనాయక్‌కు అత్యధిక మెజార్టీలో గెలిపిస్తాం.
టేకులపల్లి, నవంబర్ 1: పేదప్రజల అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం. ఆయన చేసిన సాయం జీవితాంతం మరువం. మాకు పోడు పట్టాలు ఇచ్చి దాంతో పాటు రైతుబంధు, రైతుబీమా ఇచ్చిన మనసున్న మనిషి కేసీఆర్ ఈరోజు మా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని చూడాలని సభకు వచ్చాం. రాష్ట్రంలో పేదల జీవితాలలో వెలుగులు నింపిన కేసీఆర్‌ని మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్కు అండగా నిలబడి మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా కారు గుర్తుకు ఓటువేసి గెలిపించుకుంటాం.
కొన్ని సంవత్సరాలుగా పోడు సాగు చేస్తున్నాం. గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చి పోడు సమస్యను తీరుస్తామని చెప్పి తీర్చలేదు. సీఎం కేసీఆర్ వచ్చి పోడు పట్టాలు ఇస్తానని చెప్పి మాట తప్పకుండా పోడు పట్టాలు ఇచ్చారు. దాంతోపాటు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకుంటాము. బానోత్ హరిప్రియానాయక్ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం.