– డీఎల్పీఓతో సింగరేణి సర్పంచుల సమావేశం
కారేపల్లి, ఆగస్టు 26 : సింగరేణి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు డీఎల్పీఓ తేజావత్ రాంబాబుతో మంగళవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. స్థానిక ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తో కలిసి డీఎల్పీఓ రాంబాబు సర్పంచులతో మాట్లాడుతూ పంచాయతీలలో చేపట్టే పనులన్నింటినీ యాక్షన్ ప్లాన్ ప్రకారమే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలన్నారు. అంతర్గత రోడ్లకు గ్రావెల్ తోలకాలు చేపడితే బిల్లులు చేయడం లేదని సర్పంచులు ఈ సందర్భంగా డీఎల్పీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీలకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గురించి చర్చించారు. ఈ సమావేశంలో సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్, గుమ్మడి సందీప్, దండు ప్రవీణ్, హేమలత, మత్రు, పొడుగు పెంటయ్య, బాబు సింగ్, హనుమంతరావు పాల్గొన్నారు.