ఎర్రుపాలెం, సెప్టెంబర్ 09 : పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన శీలం సంధ్య, (40) సోమవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణంలో వాకింగ్ చేస్తుండగా పాము కాటుకు గురైంది. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించినట్లు తెలిపారు. సంధ్యకు భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త శ్రీనివాసరావు రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటలు ఎస్ఐ రమేశ్ తెలిపారు.