కారేపల్లి, నవంబర్ 8: రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాటిక్ సాధించడం ఖాయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి మదన్‌లాల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచాచరు. కారేపల్లి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌తో కలిసి గుంపెళ్లగూడెం, పేరుపల్లి, రావోజీతండా, అప్పాయిగూడెం, సూర్యతండా, గుట్టకిందగుంపు, భాగ్యనగర్‌తండా, పొలంపల్లి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్నికలప్పుడే చుట్టపు చూపుగా వచ్చిపోయే పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకపోతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరో యాభై ఏళ్లు వెనుకబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అందుకని ఇతర పార్టీల మాయమాటలను నమ్మవద్దని సూచించారు. పథకాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుడూ పదిమంది ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తెలంగాణకు శ్రీరామరక్షగా నిలబడతాయని అన్నారు. వాటితోనే తాను కూడా విజయం సాధిస్తానని స్పష్టం చేశారు. పేరుపల్లి గురువమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గ్రామాలకు చేరుకున్న నాయకులకు స్థానిక మహిళలు హారతిపట్టారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మాలోత్ శకుంతల, వాంకుడోత్ జగన్, రావూరి శ్రీనివాసరావు, తోటకూరి పిచ్చయ్య, పెద్దబోయిన ఉమాశంకర్, ఉన్నం వీరేందర్, ముత్యాల సత్యనారాయణ, హన్మకొండ రమేశ్, అడ్డగోడ ఐలయ్య, ఎస్కే గౌసుద్దీన్, మంగీలాల్, ధరావత్ అచ్చమ్మ, అడప పుల్లారావు, జడల వసంత, జడల వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాసరావు, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, గుగులోత్ రాములు, అజ్మీరా నాగేశ్వరరావు, బానోత్ పద్మ, హచ్చు, ఎట్టి రజిని, ఇస్లావత్ సుజాత, ధరావత్ అచ్చమ్మ, ఎండీ హనీఫ్,తాతా వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి, సుడిగాలి భిక్షం, మణికొండ నాగేశ్వరరావు, బుడిగ ప్రభాకర్, మత్రు, సురేశ్, భూక్యా చందూనాయక్, మురళి, రాము, కోటి, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.