టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
ఇల్లెందు, డిసెంబర్ 24: ఇల్లెందు ఏరియా జేకే ఓసీ 5 విస్తరణ ప్రాజెక్ట్ నుంచి ఒక్క బొగ్గు పెల్లను కూడా ప్రైవేటుపరం కానివ్వబోమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. జేకే ఓసీలో శనివారం గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం జరిపిన వేలంలో జేకే 5 ఓసీ విస్తరణ పనులను ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయని చెప్పారు. “మా ప్రాణాలను అడ్డుపెట్టయినా సరే.. ఆ ప్రైవేటు కంపెనీలను అడ్డుకుంటాం.. తరిమి తరిమి కొడతాం” అని ప్రకటించారు. జాతీయ సంఘాల పోగొట్టిన కార్మిక హక్కులు, అవకాశాలను సీఎం కేసీఆర్ తిరిగి తీసుకొచ్చారని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, తెలంగాణ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు జీతం విడుదల, కార్మికుల క్వార్టర్లకు ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం సాధించుకున్నట్లు చెప్పారు. యూనియన్ ఉపాధ్యక్షుడు రంగనాథ్, సెంట్రల్ సెక్రటరీ కోటిరెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, నాయకులు ప్రభాకర్, బోలా, శంకర్రావు, ఆవుల శ్రీను, అజీజ్, రమేష్‌బాబు, అశోక్, జాఫర్, కోటయ్య, సత్యనారాయణ, రవి, రాజయ్య, మాధవ్, రాంచందర్, అమిత్ పాల్గొన్నారు.