తిరుమలాయపాలెం. ఏప్రిల్ 21 : రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో మంగళవారం ఆయన ప్రభుత్వ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. రైతులు తమ పంటను మధ్య దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనం దృశ్య ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు కార్యాలయం ఇన్చార్జి తంబూరి దయాకర్ రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు. మాజీ జడ్పిటిసి బెల్లం శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ మెంబర్ జడల నగేష్, రైతు నాయకులు గడ్డ గురవయ్య, జక్కుల వీరన్న, రాయల రాజకుమార్, మీగడ సత్యం, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.