మధిర, మే 01: శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని కార్మిక సంఘ నాయకుడు బెజవాడ రవిబాబు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏఐటీయూసీ, టీఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మధిరలో ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రమజీవులు హక్కుల కోసం పోరాడిన యోధుల త్యాగాలను కొనసాగించాలన్నారు.
కార్మిక సమస్యల పరిష్కారం కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఉద్యమించిన నేతల ఆశయ సాధనలో ముందుకు సాగాలన్నారు. కార్మికుల శ్రమను దోచుకుని, కనీస వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యమించిన రోజు అనేకమంది ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. వారి త్యాగ ఫలితమే నేడు కార్మికుల పని గంటలు తగ్గి కార్మికులు స్వేచ్ఛగా విధులు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.