‘పాలేరు పాత కాల్వకు తక్షణం నీళ్లు విడుదల చేయాలి’
పాలేరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పాత కాల్వకు తక్షణం నీళ్లు వదలాలని, లేనియెడల వేలాది మంది రైతులతో రిజర్వాయర్‌ను దిగ్బంధం చేస్తామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏదులాపురం...
– స్పందించకపోతే వేలాది మందితో రిజర్వాయర్ దిగ్బంధం
– పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 05 : పాలేరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పాత కాల్వకు తక్షణం నీళ్లు వదలాలని, లేనియెడల వేలాది మంది రైతులతో రిజర్వాయర్‌ను దిగ్బంధం చేస్తామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సంఘం ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలో ఉన్న పాత కాల్వకు నీళ్లు వదలాలని గత కొద్ది రోజుల నుండి రైతుల పక్షాన సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అయితే అధికారులు కేవలం శుక్రవారం రాత్రి పాలేరు పెద్ద కాల్వకు నీళ్లు వదిలినట్లు తెలుస్తుందన్నారు.
ఈ విషయంపై అధికారులను మరోసారి వివరణ కోరగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నీరును వదిలినట్లు బదులిచ్చారన్నారు. మరి పాలేరు ఎమ్మెల్యే పాత కాల్వకు నీళ్లు తీసుకురాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాత కాల్వ పరిధిలోని సాగు రైతులు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం పాత కాల్వకు నీళ్లు వదలకపోతే వేలాది మంది రైతులతో పాలేరు రిజర్వాయర్‌ను దిగ్బంధం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పాలేరు ప్రదాత అని చెప్పుకునే మంత్రికి పాత కాల్వ నీళ్లు ఎందుకు వదలాడానికి ప్రయత్నం చేయడం లేదని కందాల విమర్శించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

