రఘునాథపాలెం, మే 20 : డిమాండ్ల సాధన కోసం వీవోఏలు ధర్నాకు దిగారు. తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీవోఏల కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వీవోఏలకు సీసీలుగా ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సంపూర్ణ, లలిత, నాగమణి, స్రవంతి, రాములు, భద్రాజీ, అంజలి, రేణుక, వరలక్ష్మి, అరుణ, కల్పన, లావణ్య, సునిత, స్వాతి, ఉమ పాల్గొన్నారు.