కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో మాంసాహారం కంటే కూరగాయలే ఆరో గ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.
– ఖమ్మం మే 1
కాకరకాయ
కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహానికి మందు. కాకర రసంలోని హైపోసమిక్ పదార్థం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రిస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర రసాన్ని కుక్క, నక్కకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. సోరియాసిస్ నివారణలో కాకర కీలకపాత్ర వహిస్తుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ, విటమిన్ బీ-6, పాంథోరిక్ యాసిడ్, పాస్పరస్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే కాకరను తినడం మంచిది. కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా టీ స్పూన్ కాకర రసం తాగడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.
గుమ్మడి
తెలుగువారికి ప్రీతికరమైన, శుభప్రదమైన, తరచూ వాడే కూరగాయ గుమ్మడి. దీనిలో అద్భుత ఔషధాలు ఉన్నాయి. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. మలబద్దకం మొదలుకొని మధుమేహం వరకు చాలారకాల రుగ్మతుల నివారణకు ఉపయోగపడుతుంది. గుమ్మడిలో పొటాషియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఏ, విటమిన్ సీ కొద్దిగా ఉంటుంది.
టమాట
టమాట వాడని కుటుంబం లేదు. టమాట లేని వంటకం లేదు. టమాట శక్తిమంతమైన యాంటీ యాక్సిడెంట్‌గా పని చేస్తుంది. లైకోపిన్ పదార్థం శక్తివంతమైన యాంటీ యాక్సీడెంట్గా పని చేస్తుంది. ఎసిడిటితో బాధపడేవారు టమాటతో తయారుచేసిన వంటకాన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఉండడంతో ఎసిడిటీ దూరమవుతుంది. ఇందులో కార్బొహైడ్రేట్లు తకువగా ఉండడంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తారు. టమాట తీసుకోవడంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
బంగాళదుంప
కొన్నిచోట్ల అలుగడ్డ అని, ఉర్లగడ్డ అని కూడా పిలుస్తారు. ఆహార పౌష్టికతపరంగా బంగాళదుంపలో పిండి పదార్థాలు ప్రధానమైన ఆహారపదార్థం. బంగాళదుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ, లవణాలు ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళదుంపలో 27 మిల్లీగ్రాముల సీ విటమిన్ (ఒకరోజు అవసరంలో 45 శాతం), 620 మిల్లీ గ్రాములు పొటాషియం (అవసరంలో 18శాతం), 10.2 మిల్లీ గ్రాముల విటమిన్-బీకి (అవసరంలో 10శాతం) ఉంటాయి. కొద్ది మోతాదులో థయామిన్, రైబో ఫ్లావిన్, ఫలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్థాలు లభిస్తాయి, వర్తమాన దేశాల్లో బంగాళదుంప ఆహారపు ప్రాముఖ్యతను చాటిచెప్పడానికి ఐక్య రాజ్యసమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళదుంప సంవత్సరంగా ప్రటించడం జరిగింది.
క్యారెట్
క్యారెట్లలో అన్ని పోషకాల్లోకెల్లా విటమిన్ ఏ ఎకువగా ఉంటుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారెట్ తినాలి. కంటిచూపును మెరుగుపరిచే బీటా-కెరోటిన్ క్యారెట్లో పుషలంగా ఉంటుంది. క్యారెట్ గుండెపోటు, పక్షవాతాన్ని నివారిస్తుంది. అందులోని యాంటి యాక్సిడెంట్స్, కెరో టినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త.
చూడగానే తినాలనిపించే కీరదోస వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా దీనిలోని పోషకాలు, రీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చకని ఆహారం. ఏ విటమిన్ పుషలంగా ఉంటుంది. కంటి కింద నల్లటి చారలను దోసకాయ ముకలు తొలగిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్ దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దోస తొకలో విటమిన్ కే సమృద్ధిగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది.
ఉల్లిగడ్డ
ఎన్నో హర్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. ఉల్లిలో శరీరానికి అవసరమైన పోషకాలు తకువే. కొవ్వు తకువగా ఉంటుంది. కానీ కేలరీలు ఎకువ. ఉల్లిరసాన్ని, నెయ్యిని సమ భాగాలుగా కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో రుతుక్రమం సక్రమంగా ఉంటుంది.
పందిరి చిక్కుడు
పందిరి చికుడును ప్రాచీనకాలం నుంచి పండిస్తున్నారు. పందిరి చికుడుకాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పు దినుసులుగా వాడుతారు, బీన్స్ ఎకువగా, వరి అన్నం తకువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
బీన్స్
గోరుచికుడు. చికుడు జాతిలో ఒకటి. ఇది బలమైన ఆహారం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పండిస్తున్నారు. ప్రొటీన్, పీచు పదార్థాలు ఎకువగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు తగ్గడం, మధుమేహ చికిత్సలో ఉపయోగపడుతుంది. పిండం అభివృద్ధికి సహకరిస్తుంది. చికిత్సలో ఉపయోగపడుతుంది. సోయా చికుడు సోయాబీన్స్, పసుపు రంగులో, చికటి గోధుమ రంగులో ఉంటాయి. సోయాబీన్స్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
వంకాయ
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యమైన, విరివిగా పండిస్తున్న కూరగాయల్లో ఒకటి వంకాయ. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు, సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటక్ష న్యూట్రియెంట్స్ న్యాసునిక్ యాంటీ యాక్సిడెంట్స్‌గా పని చేస్తుంది. ఇందులో ఎకువగా పోటాషియం ఉంటుంది.
ఫ్రెంచ్ చికుడు
సన్న చికుడులో ఖనిజ సిలికాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, కనెక్టివ్ ఖనిజాలు ఆరోగ్యంగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అనపకాయ లేదా అనుములు అనేది చికుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగజాతికి చెందింది. అనపకాయలను కూరలను, గుగ్గిళ్లు చేయడానికి ఎకువగా ఉపయోగిస్తారు. దీని కాయలు పలుచగా చికుడు కాయల లాగే ఉంటాయి. దీనిని ఎకువగా రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటగా, వేరుశనగలో అంతర పంటగా పండిస్తారు.
బెండకాయ
బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, సీ విటమిన్ దీనిలో చాలా ఎకువ. దీనిలో ఉన్న డయూరిటిక్ లక్షణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తకువవుతుంది. బెండకాయ రసం తాగితే జ్వరం తగ్గుతుంది.
బీరకాయ
బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేషనకారి కూడా. పత్యంగా బీరకాయ చాలా మంచిది.. లేత బీరపొట్టు జ్వరాన్ని తగ్గిస్తుంది. బీరలు మూడు రకాలు… పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర
పొట్లకాయ
పొట్లకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థాలు ఎకువ స్థాయిలో ఉంటాయి. పొట్లకాయలో ఏ, బీ, సీ విటమిన్లతోపాటు మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము అధికాంగా ఉంటాయి. పొట్లకాయ కడుపు ఉబ్బరం, తిమ్మిర్లు, మలబద్దకాన్ని తొలిగిస్తుంది.
దొండకాయ
దొండకాయ ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చింది. సంప్రదాయ వైద్యంలో దొండపండును కుష్ఠు, జ్వరం, ఆస్తమా, బ్రాంకైటిస్, కామెర్ల చికిత్సకు వాడేవారు. దొండకాయ రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది రోగ నిరోధక ఔషధంగా పనిచేస్తుంది. దొండలో అధికంగా బీటా కెరోటిన్ ఉంటుంది.
గణుసుగడ్డ
దీనినే కొన్ని ప్రదేశాల్లో రత్నపురిగడ్డ, మొహర్రం గడ్డ అంటారు. బంగాళదుంప, కందగడ్డలో కన్నా చిలగడదుంపలో పీచుపదార్థం. ఎకువగా ఉంటుంది. చిలగడదుంపల్లో విటమన్- 6 ఎకువగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టిన్ను విటమిన్ బీ-6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరమవుతాయి. వీటిల్లోని సీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచితే, ఈ విటమిన్ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.