‘ఉపాధీ దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలి’
పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీమలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట అందోళన చేపట్టారు.
– ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
కారేపల్లి, జులై 01 : పేదలకు ఉపాధిని దూరం చేసే వీబీ జీ రామ్ జీ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం, ఎర్రబోడు, మాణిక్యారం, విశ్వనాధపల్లి, గాంధీనగర్, గాదెపాడు, చీమలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట అందోళన చేపట్టారు. అంక్షలు లేకుండా పేదలకు ఉపాధి కల్పించాలని, రైతులకు నష్టదాయకమైన విద్యుత్ సవరణ చట్టం, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె.నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మహత్మాగాంధీ జాతీయ గ్రామీణా ఉపాధి హామీని రద్దు చేసి వీబీ జీ రామ్ జీ పేరుతో పేదలకు ఉపాధి దూరం చేయుటకు పూనుకుందన్నారు. వీబీ జీ రామ్ జీ బిల్లును జులై 1 నుండి అమలు చేయనున్నట్లు ప్రకటించిందని, దీనిలో కేంద్రం 60 శాతం రాష్ట్రం 40 శాతం నిధులు భరాయించాలని పేర్కొనడం ఉపాధి కల్పన నుండి కేంద్రం దూరం జరగటమేనన్నారు.
నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా ఎగవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేసి ఉచిత కరెంట్ కు మంగళం పాడే పరిస్ధితిని తీసుకరానుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరుపై పోరాటాలే శరణ్యమన్నారు. పోరాటాలతోనే పాలకుల దిగివచ్చి పేదలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కేసగాని ఉపేందర్, యనమనగండ్ల రవి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు శనగ రాంబాబు, కేలోతు రవి, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు పండగ కొండయ్య, ఈసం సలీం, ఎండి ఇస్మాయిల్, రేగళ్ల మంగయ్య, షేక్ సైదులు, కుర్సం శ్రీను, గంగాధరణి ఉపేంద్ర చారి, చల్లా మల్లమ్మ, కరపటి లక్ష్మయ్య, సురభి సీత, ఎర్రిపోతు ముత్యాలు, రాచర్ల రణధీర్, భూక్య లక్ష్మణ్, నరసింహారావు, అబ్రహం, సారయ్య, కిరణ్, మున్న, జగదీష్, సూర్య, రమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

