బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతపర్చాలి
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సేవలు జనానికి మరింత అందుబాటులో ఉండేలా విస్తృతపర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఎస్ఎన్ఎల్ నల్లగొండ బిజినెస్ ఏరియా సలహా సంఘం శుక్రవారం ఖమ్మంలో సమావేశమైంది.
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం సిటీ, జూన్ 5 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సేవలు జనానికి మరింత అందుబాటులో ఉండేలా విస్తృతపర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఎస్ఎన్ఎల్ నల్లగొండ బిజినెస్ ఏరియా సలహా సంఘం శుక్రవారం ఖమ్మంలో సమావేశమైంది. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో రోజురోజుకు చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థ అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ టెలికం కంపెనీలకు దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలు, తండాలు, గూడేలకు బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడకుండా వినియోగదారులందరికీ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని టవర్స్ ఏర్పాటుకు అన్నిరకాల అనుమతులు మంజూరు చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ రవిచంద్ర హామీ ఇచ్చారు. తొలుత సమావేశానికి విచ్చేసిన ఆయనకు నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పీ వెంకటేశం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

