కారేపల్లి, అక్టోబర్ 14 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల వ్యాప్తంగా బుధవారం నుండి గ్రామాల్లో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న పాత కమలాపురం, గోవిందు తండా, కోమట్లగూడెం, పాటిమీద గుంపు, 16న బాల్ తండా, చిమ్నాతండా, గోవింద్ తండా, గాంధీనగర్, బాజు మల్లాయిగూడెం, 17న చిమ్నాతండా, బోటి తండా, మంగలితండా, చర్లపల్లి, చీమలపాడు, 18న కొత్త కమలాపురం, మంగలి తండా, ఒడ్డుగూడెం, పెద్ద మడింపల్లి, నానునగర్ తండా, 21న కొత్త కమలాపురం, కొత్తతండా, అనంతారం తండా, చింతలతండా, బోటి తండా, 22న కొత్త కమలాపురం, పాత చెన్నంగలగడ్డ, చిన్నమడింపల్లి, తవిసి బోడు, 23న మేకలతండా, గుంపెల్ల గూడెం, మోకాళ్ల రామయ్య గుంపు, లాల్ తండా, రేలకాయలపల్లి, 24న మేకల తండా, గుంపెల్లగూడెం, కొత్తూరు తండా, ఫైల్ తండా, లక్ష్మీపురం, 25న దుబ్బ తండ, మాదారం, సీతారాంపురం, శాంతినగర్, ఈత్యాతండా,
27న దుబ్బ తండా, మాదారం, తొడిదల గూడెం, ఫైల్ తండా, మూడు తండా, 28న గేట్ కారేపల్లి, మాదారం, పంతులు నాయక్ తండా, గేటు రేలకాయలపల్లి, 29న గేటు కారేపల్లి, కట్టుగూడెం, టేకులగూడెం, నడిమూరు, రంగురాళ్లబోడు, 30న గంగారం తండా, పేరుపల్లి, ఉసిరికాయలపల్లి, మోట్ల గూడెం, 31న గంగారం తండా, పేరుపల్లి, ఉసిరికాయలపల్లి, చింతలపాడు, అలాగే నవంబర్ 1వ తేదీన రొట్ట మాకురేవు, పేరుపల్లి, ఉసిరికాయలపల్లి, గుడితండా, కోయ గుంపు, 3న చీమలవారిగూడెం, రావోజీ తండా, ఉసిరికాయలపల్లి, రూప్ల తండా, మాణిక్యారం, 4న రేగులగూడెం, మల్లన్నగూడెం, ఆలియా తండా, ఎర్రబోడు, 5న రామకృష్ణాపురం, అనంతారం, సూర్య తండా, పోలంపల్లి, స్టేషన్ చీమలపాడు, 6న కొత్త కమలాపురం, సూర్యతండా, గేటు పోలంపల్లి, 7న గేట్ కారేపల్లి, సండ్రలగూడెం, గుట్ట కిందగుంపు, 8న గాదెపాడు, 10న బస్వాపురం, 11న ముత్యాల గూడెం గ్రామాలలో పశు వైద్య సిబ్బంది నాలుగు టీంలుగా ఏర్పడి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 4 నెలలు దాటిన ప్రతి పాడి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. పశువులకు తీవ్రమైన జ్వరం, నీరసం, నోటి నుండి తీగలవలె చొంగ రావటం, నోరు, కాలు గిట్టల మధ్య పుండ్లు, కొద్దిపాటి ఎండకు కూడా రోప్పడం, చూడి పశువులు ఈసుకుపోవటం వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని వ్యాధి వల్ల కలిగే నష్టాలతో పాల ఉత్పత్తి, పని సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడం రైతుకు ఆర్థిక నష్టం ఉంటాయన్నారు. పాలు త్రాగే దూడల్లో మరణాలు సంభవిస్తాయన్నారు. వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోవటం జరుగుతుందన్నారు. దూడల్లో మరణాలు నివారించి, ఆరోగ్యంగా ఎదగడానికి ఈ టీకాలు ఉపయోగపడుతాయని తెలిపారు. కావునా ప్రతి పశు యజమాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.