ఎర్రుపాలెం, మే 26 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం శివారులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. మంగళవారం ఎస్ఐ ఎం.రమేశ్ కుమార్ తెలిపిన వివరాలు.. మృతుడి వయస్సు సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. చామనచాయ రంగుతో, సుమారు 5.6 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడు. కుడి చేతిపై “మహాలక్ష్మి” అనే పచ్చబొట్టు ఉంది. మృతదేహంపై నీలిరంగు జీన్స్ ప్యాంటు, నీలిరంగు హాఫ్ హ్యాండ్స్ టీ-షర్టు ధరించి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.రమేశ్ కుమార్ 8712659164 నంబర్‌కు లేదా మధిర రూరల్ సీఐ కార్యాలయం సీఐ డి.మధు 8712659158 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.