రూ.15 లక్షలతో ‘భద్ర గిరి’ మార్ట్
భద్రాద్రి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సేకరించిన, సంప్రదాయ ఉత్పత్తుల మారెటింగ్ కోసం ఉమ్మడి వేదికను అందించడానికి భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుత ‘గిరి బజార్'ను ‘భద్ర గిరి మార్ట్'గా మార్చుతున్నారు.
- నవమి రోజున భద్రాచలంలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం
- గిరిజనులను ప్రోత్సహించేందుకు భద్రాచలం పీవో ప్రత్యేక దృష్టి
భద్రాచలం, మార్చి 19: భద్రాద్రి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సేకరించిన, సంప్రదాయ ఉత్పత్తుల మారెటింగ్ కోసం ఉమ్మడి వేదికను అందించడానికి భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రస్తుత ‘గిరి బజార్’ను ‘భద్ర గిరి మార్ట్’గా మార్చుతున్నారు. ఇందుకోసం రూ.15 లక్షలతో భద్ర గిరి మార్ట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నెల 27న శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రారంభించేందుకు ఐటీడీఏ పీవో రాహుల్, అధికారులు పనులను త్వరగా పూర్తి చేస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిసెట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన ‘మన్కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు.
మిల్లెట్ బిసెట్లతోపాటు గిరిజన మహిళలు మహువా (ఇప్ప పువ్వు)తో తయారుచేసిన లడ్డూ, ఇప్పపువ్వు బర్ఫీ, టీ పొడి, కరకాయ పౌడర్, కరకాయలకు కూడా మారెట్లో డిమాండ్ ఉంది. అలాగే అటవీ ఉత్పత్తులైన తేనె, సబ్బులు, షాంపోలు (కుంకుడు కాయలు), ఆదివాసీలు సేకరించిన అటవీ ఫలాలు, పండ్లు, గిరిజన రైతులు పండించే ఆర్గానిక్ తృణ ధాన్యాలు, వివిధ రకాలైన పప్పు దినుసులతోపాటు నిత్యావసర సరుకులు భద్ర గిరి మార్ట్లో విక్రయిస్తారు. గిరిజన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన మహిళలు తమ ఉత్పత్తులను ఈ అవుట్ లెట్కు సరఫరా చేస్తారు. ఆదివాసీ రైతులు పండించిన అరుదైన పప్పులు, వరి బియ్యం, ఇతర ముడి సరుకులు కూడా ఈ మార్ట్లో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయాలకు ప్రాధాన్యముంటుందని చెప్పారు.
ఆదివాసీలను ప్రోత్సహించేందుకే..
అటవీ ఉత్పత్తులను మారెటింగ్ చేసుకునేందుకు ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. వీటిని నివారించేందుకు ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా గిరిజనులు తయారుచేసే ఉత్పత్తుల విక్రయానికి ఈ భద్ర గిరి మార్ట్ దోహదపడుతుంది. ఈ మార్ట్ ద్వారా సుమారు 100 గిరిజన కుటుంబాలు లబ్ధిపొందుతాయి. మరో పదిమంది గిరిజన కుటుంబాలకు ఈ మార్ట్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
-ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

