‘జనతా గ్యారేజ్’ సినిమాలాగా..ఈ ‘మెకానిక్స్ గ్యారేజ్’ ఏమిటని అనుకుంటున్నారా..!
అది సినిమా.. ఇది జీవితం..! అది కల్పితం.. ఇది వాస్తవం..!!
‘ఇచ్చట అన్ని రిపేర్లూ చేయబడును’ అనేది ఆ సినిమా ‘గ్యారేజ్’కు క్యాప్షన్..
‘కష్టాల్లో తోడుగా.. కన్నీళ్లు తుడవగా’ అనేది ఈ మెకానిక్స్ ‘గ్యారేజ్’కు క్యాప్షన్..!!!
మెషీన్‌కు, మనిషికి చక్కటి పోలిక ఉంది. మెషీన్‌లోని ప్రధాన భాగాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి మరమ్మతుకు వచ్చినా.. మెషీన్ మొరాయించవచ్చు, మొత్తానికే ఆగిపోనూవచ్చు. అందుకే, అన్ని ప్రధాన భాగాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. మనందరికీ తెలిసిన పరిభాషలో దీనినే ‘ఐక్యత’గా పిలుస్తాం. “ఈ విషయం మా మెకానిక్స్‌కు తెలిసినంతగా మిగతా వారికి తెలిసుండకపోవచ్చు, అందుకే మేమంతా ఐక్యంగా ఉండి యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. మా ‘బండి’ ట్రబుల్ ఇస్తే.. ఆదుకునేందుకు వందలమందిమి ఉన్నాం”.. నవ్వుతూ అన్నారు టూ వీలర్ మెకానిక్ వంగాల కొండల్రావు. ఖమ్మం నగరంలోని ‘మెకానిక్స్ గ్యారేజ్’ ఆవిర్భావానికి కారణాలు, చేస్తున్న సాయంపై ‘నమస్తే తెలంగాణ’ సండే స్పెషల్.
– ఖమ్మం, డిసెంబర్ 10
అడ్డా లేదు.. అండ లేదు..
ఖమ్మంలోని టూ వీలర్ మెకానిక్స్‌కు ఒకప్పుడు ఎటువంటి అడ్డా (సంఘం) లేదు. ఎవరి నుంచీ ఎటువంటి అండ కూడా లేదు. కార్మిక సంఘాలకు, పోరాటాలకు నిలయమైన ఖమ్మంలో దాదాపుగా అన్ని రకాల కార్మికులకూ అడ్డాలున్నాయి. ఒక్క టూ వీలర్ మెకానిక్ కార్మికులకు తప్ప..! సంఘం ఉంటే.. అందరి మధ్య ఐక్యత ఏర్పడుతుంది.
కష్టనష్టాలొచ్చినప్పుడు మాట రూపంలోనో, చేత రూపంలోనే ఆదుకునేందుకు ఒకరికొకరు అండగా ఉంటారు. నాయకత్వ మార్గదర్శనం ఉంటుంది. దీనిని గుర్తించిన మొదటి వ్యక్తి వంగాల కొండల్రావు వృత్తిరీత్యా టూ వీలర్ మెకానిక్. మెకానిక్‌లకు ఓ అడ్డా (యూనియన్) ఉంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ అడ్డా.. ఓ ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని, అందులోని సభ్యులంతా బాధ్యతాయుతంగా, కష్టనష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని ఆశించారు.
ఖమ్మం, డిసెంబర్ 10: మెషిన్‌కు, మనిషికి చక్కటి పోలిక ఉంది. మెషిన్లోని ప్రధాన భాగాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి మరమ్మతుకు వచ్చినా.. మెషిన్ మొత్తం మొరాయించవచ్చు, మొత్తానికే ఆగిపోనూవచ్చు. అందుకే, అన్ని ప్రధాన భాగాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. మనందరికీ తెలిసిన పరిభాషలో దీనినే ‘ఐక్యత’గా పిలుస్తాం. “ఈ విషయం మా మెకానిక్స్‌కు తెలిసినంతగా మిగతా వారికి తెలిసుండకపోవచ్చు, అందుకే మేమంతా ఐక్యంగా ఉండి యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. మా ‘బండి’ ట్రుబుల్ ఇస్తే.. ఆదుకునేందుకు వందలమందిమి ఉన్నాం”.. నవ్వుతూ అన్నారు, టూ వీలర్ మెకానిక్ వంగాల కొండల్రావు. ‘మెకానిక్స్ గ్యారేజ్’కు సృష్టికర్త ఈయనే&!
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా..
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా ఈ కార్మికులకు అందించేందుకు యూనియన్ నాయకత్వం కృషి చేస్తున్నది. అసంఘటిత కార్మికులుగా జిల్లాలోని 250 మంది టూ వీలర్ మెకానిక్‌ల పేర్లు నమోదయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 30 మందికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ద్వారా ఆర్థిక సాయం చెక్కులను నాయకత్వం ఇప్పించింది.
ఇలా సాయం అందుతున్నది..
వృత్తి విరమించిన ఒక కార్మికుడికి మూల నిధి నుంచి నాయకత్వం రూ.30వేలు అందించింది. ఆ దంపతులను సన్మానించింది. పదోతరగతిలో 9 జీపీఏ వచ్చిన 16 మందికి రూ. 5వేల చొప్పున ప్రోత్సాహకం అందించి, తల్లిదండ్రులను సన్మానించింది. పెండ్లి చేసుకున్న నలుగురు యువతులకు, ఆడ పిల్ల పుట్టిన ఆరుగురు సహాయం అందింది. ఒక మెకానిక్ కూతురుకు ఎంబీబీఎస్ ఫ్రీ సీటు వచ్చింది. ఆమెకు రూ.25 వేలు అందించి, తల్లిదండ్రులను సత్కరించింది. మెడిసిన్ సీటు సాధించిన యూనియన్ సభ్యుల పిల్లలకు ఇక నుంచి రూ.10వేలు ఇవ్వాలని యూనియన్ నిర్ణయించింది. ఇలా, తమ యూనియన్ ఆదర్శవంతంగా నిలుస్తున్నదని సభ్యులు గర్వంగా చెబుతున్నారు.
టూ వీలర్ మెకానిక్స్ యూనియన్..
వంగాల కొండల్రావు ఆలోచన, ఆశయం నుంచి పురుడు పోసుకున్నదే.. టూ వీలర్ మెకానిక్స్ యూనియన్. దీని ఏర్పాటుకు ఆయన సుదీర్ఘ కాలంపాటు గట్టిగానే శ్రమించారు. ‘ఎవరికి వారే..’ అన్నట్లుగా ఉన్న మెకానికులందరితో స్నేహం చేశారు. కష్టనష్టాలు తెలుసుకుంటూ, తోచిన రూపంలో సాయపడుతూ ఆత్మీయంగా మెలిగారు. తామంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. సంఘంగా ఏర్పడదామని ప్రతిపాదించారు. దాని ద్వారా ఒనగూరే ప్రయోజనాలేమిటో, తన మనసులోని ప్రణాళికలు ఏమిటో వివరించారు.
‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. మరేదో ఉద్ధరిస్తారని ఎదురుచూడొద్దు. మనమంతా ఒక్కటిగ ఉందాం. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం’ అంటూ, తన తోటి మెకానికులందరినీ సిద్ధం చేశారు. అలా రెండేళ్లపాటు నిర్విరామంగా శ్రమించారు. ఆ తర్వాత, 2017లో ఒక రోజున అందరినీ ఒకేచోట సమావేశపరిచారు. అలా ఆ రోజున, వంగాల కొండలరావు నాయకత్వాన ‘టూ వీలర్ మెకానిక్స్ యూనియన్’ ఆవిర్భవించింది. దాదాపుగా ఏ యూనియన్‌కూ లేని రీతిన నియమ నిబంధనలను ఆయన రూపొందించారు. అలా ఏర్పడిన ఈ యూనియన్ ఇప్పుడు.. టూ వీలర్ మెకానికులందరికీ విశేష సేవలందిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
ప్రస్తుతం ఈ యూనియన్‌లో 270 మంది (ఖమ్మం నగరంలో) మెకానిక్‌లు ఉన్నారు. వీరికి ఏదేని సమస్య (ఆర్థిక, ఆర్థికేతర) వస్తే.. నాయకత్వం చొరవతో పరిష్కారానికి కృషి చేస్తున్నది. సభ్యులంతా మూల ధనం (నిధి) కోసం ప్రతి నెలా రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు. అత్యవసర, ఇతరత్రా ముఖ్య సందర్భాల్లో అవసరాలకు ఈ నిధి ఉపయోగపడుతున్నది. అందుకే, “మాది ‘మెకానిక్స్ గ్యారేజ్’. కష్టాల్లో తోడుగా.. కన్నీళ్లు తుడవగా..!” అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు ఈ యూనియన్ సృష్టికర్త వంగాల కొండల్రావు. ఈ సంఘానికి ప్రస్తుతం గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉన్నారు. ఈ సంఘంలోని సభ్యుల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా ఆయన అండదండలు అందిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దేవుడు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. టూ వీలర్ మెకానిక్‌లు కొందరు ఇల్లు/షాపు అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నారు. నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు మాదిరిగానే మాకు కూడా 250 యూనిట్ల విద్యత్ సబ్సిడీ ఇవ్వాలని వేడుకుంటున్నాం. సబ్సిడీ రుణాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. దళితబంధు పథకం కింద దళిత మెకానిక్‌లకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– వంగాల కొండల్రావు, జిల్లా అధ్యక్షుడు, లింగనబోయిన మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి
అండగా, ఆదర్శంగా..
ఈ యూనియన్ సభ్యులను మూల నిధి ఇలా ఆదుకుంటున్నది. దీనిని నాయకత్వం ఇలా కేటాయిస్తున్నది.