ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 4 : రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల మండలం జడ్పీహెచ్ఎస్ పెద్దగోపతి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) జి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎంపీపీఎస్ ఆర్ఎన్ గుట్ట పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న దల్లి ఉమాదేవి ఎంపికయ్యారు. వీరికి గురువారం హైదరాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేయనున్నారు.