కారేపల్లి, సెప్టెంబర్ 15 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని తొడిదలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన పేదింటి బిడ్డ ఎట్టి ప్రియ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకుంది. బీఈడీలో యూనివర్సిటీ స్థాయి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకుగాను గోల్డ్ మెడల్ వరించింది. ప్రియ తండ్రి రమణ తన చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి కోటేశ్వరి కూలి పని చేసుకుంటూ ప్రియను చదివించింది. ప్రియ బంగారు పతకం సాధించడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు అభినందనలు తెలిపారు.