కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఆదివారం మల్టీజోన్-1 ఐజీ తరుజోషీ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఇన్స్పెక్టర్లు, 13మంది ఎస్సైలకు స్థానచలనం, పోస్టింగులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్టీజోన్-1లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టి.సురేశ్ టేకులపల్లి సీఐగా, టేకులపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆలేటి ఇంద్రసేనారెడ్డి కొత్తగూడెం రూరల్(జూలూరుపాడు) సీఐగా, జూలూరుపాడు సీఐగా విధులు నిర్వర్తిస్తున్న మల్లంపల్లి శ్రీనివాస్ జిల్లా వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న రాయల వెంకటేశ్వర్లు భద్రాచలం సీఐగా, భద్రాచలం సీఐగా ఉన్న నాగరాజు మల్టీజోన్-1 ఐజీ కార్యాలయానికి, ఎస్బీ-2లో ఉన్న ఆలెం రాజు వర్మను చర్ల సీఐగా, ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న సట్ల రాజుని ఎస్బీ-2 ఇన్స్పెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
13మంది ఎస్సైల బదిలీ : బూర్గంపహాడు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఈ. రాజ్‌కుమార్ కొత్తగూడెం సీసీఎస్‌కు, సీసీఎస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కే. సుమన్ బూర్గంపాడు ఎస్హెచ్ఓగా బదిలీ అయ్యింది.
అదే విధంగా అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పి. శ్రీకాంత్ బోడు ఎస్‌హెచ్‌వోగా, బోడు ఎస్‌హెచ్‌గా ఉన్న రంజిత్ కొత్తగూడెం వీఆర్‌కు, ఇల్లెందు ఎస్సై-1గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.కే. సైదా రహూఫ్కు టేకులపల్లి ఎస్‌హెచ్‌వోగా, టేకులపల్లి ఎస్‌హెచ్‌వోగా ఉన్న జి. రమణారెడ్డికి మణుగూరు ఎస్సైగా, మణుగూరు ఎస్సై-1గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాముల శ్రీనుకి అశ్వారావుపేట ఎస్‌హెచ్‌వోగా, వీర్ఆర్లో ఉన్న సందీప్ కుమార్‌కు ఇల్లెందు ఎస్సైగా, కొత్తగూడెం వన్ టౌన్ ఎసై1గా విధులు నిర్వర్తించిన బి.శ్రీనివాస్‌కు పాల్వంచ రూరల్ ఎస్‌హెచ్‌వోగా, వీఆర్‌లో ఉన్న ఎం. రాజమౌళికి ముల్కలపల్లి ఎస్‌హెచ్‌వోగా, వీఆర్‌లో ఉన్న వెంకటప్పయ్యకు ఏడూళ్లబయ్యారానికి, ఏడూళ్లబయ్యారం ఎస్‌హెచ్‌వోగా ఉన్న పథాన్ నాగుల్ మీరాఖాన్కు కొత్తగూడెం వీఆర్‌కు, పాల్వంచ రూరల్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న జె. కార్తిక్కును వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.