టూరిజం రంగంలో అవకాశాలనుయువత సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా సోమవారం యువ టూరిజం క్లబ్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
- భద్రాద్రి కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా సోమవారం యువ టూరిజం క్లబ్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లాలో టూరిజం రంగంపై అవగాహన పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతలో పర్యాటక ప్రదేశాల పట్ల ఆసక్తి పెంచడంతోపాటు వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయన్నారు. టూరిజం వారోత్సవాల సందర్భంగా 19న పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద టూరిజం అవేర్నెస్ డ్రైవ్, 20న కారుకొండ రామవరంలోని బౌద్ధ రాక్ కేవ్స్ వద్ద హెరిటేజ్ వాక్, 21న యూట్యూబర్లతో సమావేశం, 22న బౌద్ధ రాక్ కేవ్స్ ప్రాంతంలో స్వచ్ఛ డ్రైవ్, 23న పాల్వంచలోని ఐడాక్‌లో బ్రాండ్ కిట్ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.
కలెక్టర్‌ను కలిసిన నూతన డీఆర్వో
జిల్లా రెవెన్యూ అధికారిగా నూతనంగా నియమితులైన పద్మావతి సోమవారం కలెక్టర్ అంకిత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవెన్యూశాఖకు సంబంధించిన పలు అంశాలపై స్వల్పంగా చర్చించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

