కారేపల్లి : తిరుమల ఫౌండేషన్(Tirumala Foundations) ఆధ్వర్యంలో ఇద్దరు పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ (Laptops) లు అందజేసి అండగా నిలబడడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
దిండిగాల రాజేందర్(Rajendhar ) అన్నారు. కారేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన తిరుమల ఫౌండేషన్ అధినేత చల్లా తిరుమల రావు సంస్థ తరఫున ఇల్లందు పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని బత్తుల సాధ్వికకు లాప్‌టాప్‌ను శనివారం అందజేశారు.
అనంతరం ముచ్చర్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రేగళ్ల సందీప్‌కు అందజేశారు. పేద విద్యార్థులకు చేయూతను అందించడం పట్ల ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత చల్లా తిరుమలరావు, ప్రతినిధులు నాగరాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు .