ఎర్రుపాలెం, జూలై 31 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లి కట్టలేరు నదిలో గల్లంతైన సంఘటన గురువారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బంజర కు చెందిన 9 మంది వ్యక్తులు మీనవోలు బ్రిడ్జి సమీపంలోని కట్టలేరులో చేపలు పట్టేందుకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నదిలోకి దిగగా అందులో ముగ్గురు వ్యక్తులు బాదావత్ రాజు (55), భూక్యా కోటి (46), భూక్యా సాయి (25) కట్టలేరు లోతు తెలియకపోవడంతో పాటుగా ఈత రాక నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.
తోటి వ్యక్తులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమవడంతో స్థానిక అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రెహ్మాన్, తాసీల్దరా్ ఎం. ఉషా శారద, సీఐ మధు, ఎస్ఐ రమేశ్ లు ఫైర్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలను చేపట్టారు.