మధిర, మార్చి 27 : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో గల శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. దేవాలయ పూజారి రామకృష్ణ గురువారం ఉదయం స్వామివారి పూజా కార్యక్రమాలకు ఆలయానికి చేరుకోగా అప్పటికే దేవాలయ గేటు, తలుపులు, హుండీ తాళం పగలగొట్టిన ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపాడు.
దొంగలు హుండీలోని నగదు, అమ్మవారి కిరీటాన్ని అపహరించుకుపోయారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారు. విషయాన్ని స్థానిక పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులకు తెలిపారు. ఆలయాన్ని రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.