కూసుమంచి రూరల్, జనవరి 7: సొసైటీలు అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కల్లూరిగూడెం సొసైటీ పరిధిలోని జుజ్జల్రావుపేటలో నాబార్డ్ ఆర్థిక సాయం రూ.63 లక్షలతో నిర్మించిన గోదామును డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సహకార సంఘాల నుంచి రైతులకు రుణాలు అందించడమే కాకుండా ధాన్యం కొనుగోళ్లు, విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయన్నా రు. ఇతర బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ జిల్లాలో వివిధ సొసైటీల పరిధిలో 75 గోదాముల నిర్మాణానికి నాబార్డు నుంచి 35 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి విజయకుమారి, ఏడీఏ విజయచంద్ర, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, సొసైటీ చైర్మన్లు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, నలబోలు చంద్రారెడ్డి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ మందడి పద్మ, ఎంపీటీసీ బానోత్ సుజాత పాల్గొన్నారు.
కూసుమంచి, జనవరి 7: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, విద్యతోపాటే అన్నీ సాధ్యమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. కూసుమంచిలోని హైస్కూల్ల్లో జరిగిన క్రీడల విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. హెచ్ఎం రేలా విక్రంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.
కూసుమంచి పాఠశాలలో 900 మంది విద్యార్థులు ఉన్నారని వారికోసం డిజిటల్ తరగతులకు కావాల్సిన వాటి కోసం సాయం చేయాలని హెచ్ఎం విక్రంరెడ్డి ఎమ్మెల్యేను కోరగా అందుకు స్పందించిన ఎమ్మెల్యే డిజిటల్ తరగతులకు రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇస్తానన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. ఖ మ్మం రూరల్ జడ్పీటీసీ యండవల్లి వరప్రసాద్, సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, పార్టీ మం డల అధ్యక్షుడు వేముల వీరయ్య, బెల్లం వేణుగోపాల్, పాఠశాల కమిటీ చైర్మన్ నైమాబేగం, పోటీల నిర్వాహక దాతలు గంగాధర్, రెడ్యా నాయక్, చౌడవరపు కృష్ణారావు, రేపాల శ్రీను, ఇంటూరి నారాయణ పాల్గొన్నారు.
మండలంలోని బచ్చోడును మండల కేంద్రం చేయాలని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి శనివారం కూసుమంచిలోని క్యాంపు కార్యాయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మండలంలోని ఏలువారిగూడేనికి చెందిన గుగులోత్ లచ్చీరాం కుమార్తె భవ్య ఎయిమ్స్‌లో ఫ్రీ ఎంబీబీఎస్ సీటు సాధించటంతో ఆమెకు ఎమ్మెల్యే కందాళ రూ. 50 వేలు అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ దేవర దెవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, జనవరి 7: మండలంలోని ముత్తగూడెం, గూడూరుపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే కందాళ పర్యటించారు. ముత్తగూడెం సర్పంచ్ గోనే భుజంగరెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి మృతిచెందారు. విషయం తెలుసుకొని భుజంగరెడ్డి ఇంటికెళ్లి సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ స భ్యులకు సానుభూతి తెలిపారు. గూడూరుపాడులో బండి భూషమ్మ, గోకినపల్లి వెంకటమ్మ ఇళ్లకెళ్లి చిత్రపటాలకు నివాళి అర్పించి ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీ పీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు గూడ సంజీవరెడ్డి, ముత్యం కృష్ణారావు, జర్పుల లక్ష్మణ్నాయ క్, వెంపటి రవి, మట్టా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, జనవరి 7: మండలంలోని కాకరవాయిలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ గూడూరి లక్ష్మీకాంతయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శనివారం పరామర్శించి లక్ష్మీకాంతయ్య చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతివ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీపీ బోడ మంగీలాల్, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పనూతల నాగేశ్వరావు, తుమ్మల యుగేందర్, చామకూరి సురేందర్‌నాథ్, బానోత్ బాలు ఉన్నారు.