పాలేరు మళ్లీ నీటిగండం?
ఐదు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్‌కు మళ్లీ నీటిగండం పొంచి ఉంది. క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 9 అడుగులకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 3,500 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.
- తొమ్మిది అడుగులకు పడిపోయిన జలాశయ నీటిమట్టం
- మరో 15 రోజులకు మాత్రమే సరిపడేలా ఉన్న తాగునీరు
- ఈలోపు వర్షాలు రాకుంటే పరిస్థితి జఠిలమయ్యే ప్రమాదం
ఐదు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్‌కు మళ్లీ నీటిగండం పొంచి ఉంది. క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 9 అడుగులకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 3,500 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పాలేరు చరిత్రలోనే లేని విధంగా గత ఏప్రిల్‌లో ఐదు అడుగుల అట్టడుగుస్థాయికి నీటిమట్టం పడిపోయింది. దీంతో జిల్లా యంత్రాంగంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తమై సాగర్ డ్యాం నుంచి వారం రోజులపాటు నీటిని విడుదల చేయించారు. ఫలితంగా వేసవి నీటి సమస్య తీరింది. ప్రస్తుతానికి రోజురోజుకూ తగ్గుతున్న నీటిమట్టం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరో 15 రోజుల్లో వర్షాలు అందుకొని వరదలు రాకపోతే మరోసారి తాగునీటి సమస్య జఠిలమయ్యే ప్రమాదం లేకపోలేదు.
కూసుమంచి, జూన్ 24: మిషన్ భగీరథ ద్వారా సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లోని కొంతభాగం గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న పాలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మరో 15 రోజుల వరకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి.
ఇటీవలి మార్చి నుంచి ఏప్రిల్ వరకు మిషన్ భగీరథ తాగునీటి విషయంలో హై అలర్ట్ ప్రకటించి జిల్లా యంత్రాంగం.. మొత్తం పాలేరులో మకాం వేసి రేయింబవళ్లూ పర్యవేక్షించారు. ఏప్రిల్, మే నెలల్లో అప్పటికే నిల్వ ఉన్న నీటిని రెండు లేదా మూడు తడులకు సాగునీరుగా ఇవ్వాలని ఓవైపు రైతులు, తాగునీటికే ఇవ్వాలని మరోవైపు ప్రజలు కోరడం వంటివి చోటుచేసుకున్నాయి. సరిపోయే నీళ్లు లేని పరిస్థితుల్లో 20 రోజులపాటు ఇక్కడ సమస్య రాష్ట్ర సమస్యగా మారిన విషయం విదితమే. ఎట్టకేలకు మంత్రులు పొంగులేటి, తుమ్మల చొరవతో సాగర్ నుంచి జలాలు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ నీరు చౌర్యం కాకుండా నెల రోజులపాటు అధికారులు గస్తీ కూడా ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ 4 నుంచి 10 రోజులపాటు సాగర్ నుంచి నీరు రావడంతో పాలేరు నీటిమట్టం 5 అడుగుల నుంచి 18.5 అడుగులకు చేరింది. ఇప్పటి వరకూ ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించారు. దీంతో ఇప్పటికి పాలేరు నీటిమట్టం 9 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం జూన్ నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నా ఇంకా ఆశించిన మేర వర్షాలు రాకపోవడంతో పాలేరుకు వరద రాలేదు. ఎగువన సాగర్ పరిస్థితీ గడ్డుగానే ఉంది. ఈ తరుణంలో మళ్లీ మరో 15 రోజుల్లో పాలేరు డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదముంది. ముందస్తుగా అప్రమత్తం కాకపోతే సమస్య మళ్లీ తీవ్రరూపం దాల్చనున్నది.
వర్షాలపైనే భారం..
సాగర్‌లో డ్యాం పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి అవసరాల కోసం మరోసారి 3 టీఎంసీల వరకు విడుదల చేసే అవకాశముంది. కానీ.. సాగునీటి సరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వర్షాకాలం మొదలైనప్పటికీ చెదురుమదురు జల్లులు మినహా పెద్ద వర్షాలు కురవలేదు. దీంతో పాలేరు నిండలేదు. ఫలితంగా ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు మళ్లీ వర్షాల కోసమే చూస్తున్నారు. పాలేరు ఇన్‌టేక్‌వెల్ తీసుకొంటున్న నీరు క్రమంగా తగ్గుతోంది. మిషన్ భగీరథ అవసరాల కోసం రోజుకు 130 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో రోజుకు 0.15 నుంచి 0.20 అడుగుల వరకు నీటిమట్టం తగ్గుతోంది.
కేఆర్ఎంబీ పరిధిలోకి పోవడంతో కష్టాలు..
గతంలో సాగర్ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కొంత వెసులుబాటు ఉండేది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లింది. దీంతో సాగర్ జలాల వినియోగం విషయంలో తెలుగు రాష్ర్టాలకు గతంలో ఉన్న అధికారాలు లేకుండాపోయాయి. దిగువ జలాశయాల కింద ఉన్న ప్రజల గొంతులు ఎండుతున్నా, పంటలు ఎండిపోతున్నా కేఆర్ఎంబీ నిర్ణయం మేరకే సాగర్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలేరు పరిధిలో తాగునీటికి, సాగునీటికి అవరోధాలు ఏర్పడుతున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

